మంత్రాలయంలో పింఛన్ల పంపిణీ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం సంతకుంట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జనసేన పార్టీ ఇంచార్జ్ బి. లక్ష్మన్న కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం చింతకుంట గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పింఛన్లు అందజేశారు. ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ జరుగుతున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ పోటీ పడుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని తెలిపారు. ప్రజల మనస్సుల్లో ఈ నాయకులు దేవుళ్లలాగా నిలిచారంటూ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి, పనిపాడు రామిరెడ్డి, జక్కినేని వెంకటేశ్వర్లు, రామకృష్ణ, కోసిగయ్య, నాడిగని అయ్యన్న, తాయన్నతో పాటు టిడిపి–జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment