ఐనవిల్లి మండలాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఐనవిల్లి మండల విలస గ్రామ వాసులూ, ఈ సందర్బం గా ఆయన మాత్లాడుతూ మీ అందరితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల ఎంత నిబద్ధతతో పని చేస్తుందో, ఈ పెన్షన్ కార్యక్రమమే ఒక పెద్ద నిదర్శనం. వృద్ధులకు, వికలాంగులకు, నిరుపేదలైన మహిళలకు – ప్రతి ఒక్క అర్హులులైన వ్యక్తికి సహాయపడటమే మా లక్ష్యం. ఈ రోజు ఐనవిల్లి మండలం విలాస గ్రామంలో అనేక మంది లబ్ధిదారులకు పెన్షన్ అందించాం. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు – ఇది రాష్ట్రం తరఫున చూపుతున్న గౌరవం, ఆదరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment