మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారంపై పెంటేల బాలాజి హ‌ర్షం

చిల‌క‌లూరిపేట‌, మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ నిత్య విద్యార్థిగా, అలసిపోని శ్రమజీవిగా, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే ఆపద్భాంధవుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ సినిమా రంగంలో తన ప్రతిభతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న చిరంజీవి, సేవా కార్యక్రమాలతో సమాజానికి అహర్నిశలు సేవ‌లు అందిస్తూ, హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్ లో జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం, ఆయన చేసిన విశేష కృషికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించిందని బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమను శాసించిన చిరంజీవి, వెండితెర ‘బాస్’గా మారి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారు. సినీ ప్రస్థానంలోనే కాక, సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చూపిన నిబద్ధత జనసేన కార్యకర్తలకు ఎంతో స్పూర్తినిచ్చిందని బాలాజి పేర్కొన్నారు. అభిమానులు త‌న‌ను అభిమానించ‌టమే కాదు. ప్ర‌జ‌ల‌కు అప‌న్న హ‌స్తం అందించాల‌ని చిరంజీవి ఆశిస్తార‌ని వెల్ల‌డించారు. మెగాభిమానుల్లో సేవాస్పూర్తిని నింపి నడిపించే దీపం చిరంజీవి అని, ఆయ‌న సైతం కేవలం హీరోగానే కాదు, సామాజిక సేవలోనూ చిరు ముందుంటారని వెల్ల‌డించారు. ముఖ్యంగా సినీ కార్మికులకు.. నటీనటులకు తనవంతు సాయం చేస్తూ వారిని కష్టాల్లో ఆదుకుంటారని గుర్తు చేశారు. మెగాభిమానులకు సేవా స్ఫూర్తిని నింపి, తాను ఎంచుకున్న సేవా మార్గంలో రక్తదానం, నేత్రదానం, అనేక సేవలు చేసి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేశార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయడంలో తానెప్పుడూ ముందుంటానని, అత్యవసర సమయాల్లో వారిని ఆదుకునేందుకు ఎంతటి స్థాయికి వెళ్లేందుకైనా వెనకాడనని చెప్పిన గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవిన అన్నారు. రక్తం అందక ఎవరూ మృతి చెందకూడదనే సదాశయంతో రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన చిరంజీవి మాటే శాసనంగా మెగాభిమానులు నిత్యం రక్తదానం చేస్తూనే ఉన్నారని వెల్ల‌డించారు. జ‌న‌సైనికులు, మెగా అభిమానులు మెగాస్థార్ చిరంజీవి, జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు చేయాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment