పశ్చిమగోదావరి జనసేన అధ్యక్షుడిని కలిసిన పెనుగొండ జనసైనికులు

జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవింద రావు(చినబాబు)ను పెనుగొండ మండల జనసైనికులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల అధ్యక్షులు కంబాల బాబులు, జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, రామన్నపాలెం MPTC మోఖమట్ల క్రిష్ణకాంత్, యర్రంశెట్టి బాబురావు, బళ్ళ మాధవ్, సానబోయిన మోహన్ రావు, తోట సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.