వైసిపి నేతల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారు

కిరణ్ రాయల్, జనసేనపార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ ఛార్జ్

తిరుపతి ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్లకు మీ పార్టీలో కొందరు వ్యక్తులు చేస్తున్న అవినీతి, అరాచకాలు, బ్లాక్ మెయిల్ ల గురించి మీకు తెలుసా – అని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేసంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ వైసిపి నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. నా కులంపై విమర్శలు చేశారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మంత్రి రోజా, టిటిడి ఇఓ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయరెడ్డిలు నన్ను టార్గెట్ చేశారు. నేను శ్రీవారి టిక్కెట్లను విక్రయించి ఉంటే నాపై కేసు పెట్టి అరెస్టు చేయండి. నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. రెండు, మూడురోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్థమయ్యారు. ఒక సామాన్యుడిపై మీ అరాచకం చూపకండి. పాపం భర్త లేని మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. ఒక భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసిపి యువనేత జనసైనికులకు చెబుతున్నాడు. ఆ వైసిపి యువనేత ఆడియో నా దగ్గర ఉంది. వైసిపి నేత ఆడియోను తిరుపతి ఎస్పీకి ఆఫీస్ లో స్పందనలో చూపించా.. ఫిర్యాదు చేశాను. ఎస్పీగారు స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళతాను. అని ఆధారాలు సేకరించి ఇంకాఎంత దూరం అయినా పోరాడుతా. రాబోయే ఎన్నికల సీజన్ తిరుపతి ప్రజలు అని చూస్తున్నారు. వైసిపి నేతల ఆగడాలను తిరుపతి ప్రజలు గమనిస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపుతారా..? నేను భయపడను..నాపై ఎలాంటి కేసులైనా పెట్టుకోండి..నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు..వచ్చే ఎన్నికల తరువాత టిడిపి- జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని కిరణ్ రాయల్ సోమవారం మీడియా ముఖంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, లక్ష్మి, లావణ్య, రమేష్ నాయుడు, రాజేష్ ఆచారి, వినోద్, చరణ్, పురుషోత్తం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.