వైసీపీకి తమ ఓటుతో ఘోరీ కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

  • వైసీపీ నాయకుల కుట్రలను సాగనివ్వం
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో వైసీపీ నేతలు
  • తమ ఓటు ఉందొ లేదో ప్రతీ ఒక్కరూ సరిచూసుకోవాలి
  • ఓటు హక్కు నమోదుపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వైసీపీ అరాచకాలను, దాష్టీకాలను ప్రజలు ఇక భరించే స్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో వైసీపీకి ఘోరీ కట్టేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా ప్రతీ పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓట్ల నమోదు ప్రక్రియను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. కొత్త ఓట్ల నమోదుతో పాటూ వివాదాస్పదంగా మారిన ఫారం 7 లపై బీ యల్ ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల నమోదులో, చేర్పులు, మార్పుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని బీ యల్ ఓ లను కోరారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ తమకు ఓటమి ఖాయమైందన్న విషయం వైసీపీ నేతలకు అర్థమైపోయిందన్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు ఆఖరి అస్త్రంగా ఓట్ల తొలగింపుకు తెరతీసారని విమర్శించారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు ఉందొ లేదో ఒకసారి పరిశీలించుకోవాలని కోరారు. జనసేన , టీడీపీ సానుభూతిపరులతో పాటూ వైసీపీ అక్రమాలను , దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న వారి ఓట్లను వైసీపీ నేతలు తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు తెలియకుండానే మన ఓటు తీసేయమంటూ వైసీపీ నేతలు ఫారం 7 లను అధికారులకు అందచేస్తున్నారన్నారని అగ్రహం వ్యక్తం చేసారు. గత ఎన్నికల్లో ఓటు వేశాం కదా ఇప్పుడు మా ఓటు ఉంటుందిలే అన్న భావనలో ఉండకుండా ప్రతీ ఒక్కరూ ఓటరు లిస్ట్ లో తమ ఓటు ఉందొ లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవలన్నారు. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే కొత్త ఓటుకి అప్లై చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు ఎంతో అమూల్యమైనదని ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించటంలో ఓటు హక్కే కీలకమని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో సయ్యద్ షర్ఫుద్దీన్, షేక్ నాగూర్, అంజి, నైజాం బాబు, తిరుమలరావు, నండూరి స్వామి, మస్తాన్ వలి, బియ్యం శ్రీను, పోతురాజు, వడ్డె సుబ్బారావు, జిలాని, కోలా మల్లి, చింతకాయల సాయి, బాలకృష్ణ, తేజ, ముత్యాల రెడ్డి, శ్రీధర్, సుందరరావు, తదితరులు పాల్గొన్నారు.