అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకోవటమే కాకుండా చెప్పటానికి వీలులేని ఆకృత్యాలకు పాల్పడ్డ ప్రతీ వైసీపీ నాయకుడు పాప ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందేనని, రానున్న రోజుల్లో వైసీపీ నేతలతో జైళ్లు కూడా పట్టవని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. వైసీపీ నేరస్థుల మూలాఖత్ యాత్రలకు జగన్ శ్రీకారం చుడితే బాగుంటుందని అయన ఎద్దేవా చేశారు. మంగళవారం జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో మూలాఖత్ అనంతరం తాము అధికారంలోకి రాగానే అధికారుల బట్టలూడతీస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై అయన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియాతో ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రజలే వైసీపీని 11 పీలికలు చేశారని అయినా ఆ పార్టీ నేతల్లో పైసాచికత్వం ఏమాత్రం తగ్గలేదని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన జగన్ కు మతిభ్రమించిందని అయన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలే అసహించుకుంటున్నారన్నారంటూ దుయ్యబట్టారు. కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని వైసీపీని ప్రజలు ఎప్పుడో మరచిపోయారన్నారు. మాట్లాడితే తాము అధికారంలోకి వస్తామంటూ జగన్ గాల్లో మేడలు కడుతున్నారంటూ విమర్శించారు. జనసేన ఉన్నంతకాలం వైసీపీ అధికారంలోకి రావటం కల్ల అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీకి ఇక భవిష్యత్ లేదని ఆ పార్టీలో అక్కడక్కడున్న మంచి నేతలు తమ భవితవ్యం గురించి ఆలోచించుకోవాలని ఆళ్ళ హరి హితవు పలికారు.
Share this content:
Post Comment