వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు సమస్యలు చెప్పుకునే హక్కు కోల్పోయారు

🛑 ఆగ్రహం వ్యక్తం చేసిన యడ్లపల్లి రామ్ సుధీర్
🛑 ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి పర్మిషన్లు కావాలా?
🛑 సీఎం భారీ సభలు పెట్టీ బటన్లు నొక్కడానికి మాత్రం అవసరం లేదు.
🛑 మంత్రులు, ఎమ్మెల్యేల కార్యక్రమాలకు అవసరం లేదు.
🛑 అధికారులే జనాన్ని తరలిస్తారు
🛑 జనం సమస్యలు చెప్పుకుంటామంటే అదే అధికారులతో అడ్డుకుంటారు
🛑 పెడన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టడం లేదు
🛑 చినపాండ్రాక అరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగు పర్చాలి
🛑 రెండు మండలాల ప్రజల ప్రాణాలు మంత్రి గాలికొదిలేశారు
🛑 మంత్రి జోగి రమేష్ పెడన ప్రజలకు చేసిందెంటో చెప్పాలి
🛑 80 వేల మందికి ఇదా ఆసుపత్రి
🛑 హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే సరిపోదు… ప్రజల హెల్త్ బాధ్యత తీసుకోవాలి
🛑 జనసేన నిరసన దీక్ష భగ్నం చేసిన పోలీసులు
🛑 సమస్య పరిష్కారం అయ్యేవరకు జనసేన పోరాడుతుంది.

.
పెడన, బంటుమిల్లి, ఎనిమిదేళ్లు ఎమ్మెల్యేగా చేస్తున్న మంత్రి జోగి రమేష్ చిన పాండ్రాక ఆసుపత్రిని పట్టించుకోలేదు అని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గురువారం బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు అనుసంధానంగా ఉన్న చిన పాండ్రాక ఆసుపత్రిని అప్ గ్రేడేషన్ చేయాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బంటుమిల్లి బస్టాండ్ ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పెడన నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుదీర్ నేతృత్వంలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న రామ్ సుధీర్ తో పాటు జనసేన నాయకులను అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం వారిని విడుదల చేయగా స్థానిక అంబేద్కర్ సెంటర్ ముందు జనసేన నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలతోపాటు పరిసర ప్రాంత వాసులైన సుమారు 80,000 మందికి అవసరమైన చిన పాండ్రాక ఆసుపత్రిని మంత్రి జోగి రమేష్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 30 పడకల ఆసుపత్రిగా భవన నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఇక్కడ వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమయింది అన్నారు. ఆస్పత్రి ప్రారంభమైతే అయింది గానీ సేవలు మాత్రం లేవన్నారు. ఎన్నికల్లో జిల్లాలో తీర ప్రాంతమైన పెడనకు వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తానని హామీ ఇచ్చిన మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో ఉండటం తప్ప ఇక్కడ ప్రజలు సమస్యలు పట్టడం లేదన్నారు. కనీసం ప్రజలు సమస్యలు చెప్పుకుందాం అన్న పోలీసులు చేత, అధికారులు చేత అణిచివేస్తున్నారు. ఇటీవల సరైన సమయంలో వైద్యం అందక ఒక గర్భిణీకి బిడ్డ చనిపోగా, చాలామందికి పాముకాటుకు వైద్యం అంతక చనిపోయిన దాఖలాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా మంత్రి జోగి రమేష్ జిల్లా శివారు ప్రాంతమైన ఈ ప్రాంత వాసులకు కార్పొరేట్ ఆసుపత్రి మాదిరిగా వైద్యం అందించాలని, లేనిపక్షంలో వచ్చే జనసేన ప్రభుత్వంలోనే ఇక్కడ ప్రజలకు మెరుగైన కార్పొరేట్ మాదిరి ప్రభుత్వ వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బంటుమిల్లి మండలం అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, పుప్పాల రంగారావు, చీటికీనేని రవి తేజ, గొట్రూ రవి కిరణ్, మారుబోయిన సుబ్బు, పయ్యావుల నాగంజనేయులు, శ్రీనివాస్, పాశం నాగమల్లేశ్వర్రావు, పసుపులేటి నరేష్, కొప్పినేటి శివమణి, నరేష్, లక్ష్మి నారాయణ, పిన్నేంటి రాంబాబు, బత్తుల సాంబశివరావు, వల్లరాపు బాబీ, మోచర్ల శర్మ, కొప్పినేటి బాబీ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.