కాకినాడ సిటిలో ప్రజలకు రక్షణ కరువైంది: ముత్తా శశిధర్

కాకినాడ సిటి: కాకినాడ సిటి జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ పత్రికావిలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో ముత్తా శశిధర్ మాట్లాడుతూ గురువారం సాయంత్రం సుమారు 4గం. సమయంలో కాకినాడలోని ముఖ్య రహదారి అయిన వార్ఫ్ రోడ్డులోని పెట్రోలు బంకులో కాకినాడ సిటి శాశనసభ్యుని అనుచరులు చేసిన దౌర్జన్యనాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండించారు. నేడు కాకినాడ సిటిలో ప్రజలకు రక్షణ కరువైందనీ పెట్రోలు బంకు యజమాని మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిన వేళ అక్కడున్న సిబ్బందిపై దాడి చేయడం చూస్తుంటే నాడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజావాణిలో ప్రజలు నగరంలోని అధికార పార్టీప్రతినిధులు మరియు వాళ్ళ మనుషుల దౌర్జన్యాలపై మొరపెట్టుకున్నది, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినది నిజమన్నది మొరొక్కసారి ఋజువైందన్నారు. బంకు యజమాని రామక్రిష్ణ గారు స్పష్టంగా ఆయన అనుమానాన్ని కాకినాడ సిటి శాశనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద , కుడా సంస్థ అధికార పదవిలో ఉన్న వారి కుటుంబ సభ్యుల పైన ఆరోపణ చేసారనీ అది భారతరాజ్యాంగం ప్రతి పౌరుడికీ ఇచ్చిన హక్కు అనీ, కానీ తన ఫిర్యాదుని తీసుకోడంలో తాత్సర్యం చేస్తూ అక్కడ డబ్బులు తీసుకుని, సరుకు మొత్తం కైంకర్యం చేసీదాకా కాలయాపన చేయడం దారుణమన్నారు. 100 నంబరుకు మరియు వివిధ రూపాలలో పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే చేసిన మనిషికి అక్కడ ఉండకండి, చుట్టుపక్కల తిరగకండి మేము వచ్చేదాకా అని చెప్పడం చూస్తే చాలా ఘోరమన్నారు. సిసి కెమెరాల వైర్లు కట్ చేసారనీ, వైర్లు దొరకనివాటికి కెమేరాలను వెనక్కు తిప్పేసారనీ, కానీ అద్రుష్టవశాత్తు ఒక కెమేరాని వారు కనిపెట్టలేదనీ అందులో మొత్తం రికార్డు అయ్యిందన్నారు. ఫుటేజీలోని మనిషి అఫ్ఫీసులో పెట్రోలుకు డబ్బులు కట్టడానికి వెళ్ళాడని బొంకుతున్నారనీ, సహజంగా మనం పెట్రోలు కొట్టించుకున్నాకా డబ్బులు అక్కడే కడతామనీ అంతేకానీ ఆఫీసులోపలికి వెళ్ళి కట్టమనీ చేసిన నేరాన్ని కప్పిపుచుకునే మాటలు ఇవన్నీ అన్నది లొకం మొత్తానికి తెలుసన్నారు. ఈ ఊరిలో భూకబ్జాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి ఇదే విషయాన్ని మా నాయకుడు కూడా చెప్పడం జరిగింది మరి ఇపుడు బాధితుడు రామక్రిష్ణ గారు స్వయంగా పోలీసులకి ఫిర్యాదు చేస్తుంటే తీసుకోవడానికి అభ్యంతరమేంటన్నారు. 2020 సంవత్సరంలో ఒక సంఘటన మీద ఆసమయములో అక్కడ మేము లేకపోయినా వారు చేసిన ఫిర్యాదుమేరకు పోలీసు వారు మా అందరిమీద కేసులు కట్టారనీ అయినా మేము పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా న్యాయస్థానంలో మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాంకానీ, మరి పత్రికాముఖంగా అడుగుతున్నా ఇక్కడ కేసు పెట్టడానికి వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేసారు. అసలు ఫిర్యాదుని తీసుకుని చట్టపరంగా న్యాయపరంగా దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీసి వాళ్ళు లేరని చెపితే మేము ఒప్పుకుంటాముగా అని ప్రశ్నించారు. మా హక్కులని పొందేందుకు కాకినాడ సిటిలో లేదా అని ప్రశ్నించారు. నేడు న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చి నిరశనలు చేస్తున్నరు కొత్తగా రాష్ట్రంలో తెచ్చిన టైటిల్ డీడ్ యాక్ట్ మీద అంటే ఎవరైనా వచ్చి ఈఆస్థి నాది అనిచెపితే అధికారి సంతకం చేస్తే అది ఆ వ్యక్తి సొంతం అయిపోయినట్లే అని ఇది అన్యాయమనీ, మరి ఇప్పటివరకు ఈ ఊళ్ళో కబ్జాలు అయిపోయాయి ఇప్పుడు వ్యాపారాలమీద కూడా పడి మావని చెపుతారా, ఆక్రమిస్తారా అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కొత్తగా ఇండస్ట్రీలు పెడతామన్నవాళ్ళని తరిమివేసినట్టు నేడు కాకినాడలో కొత్తగా వ్యాపారాలు చేయ్స్తున్న వాల్లని పారద్రోలే కొత్తసంస్కృతిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోగడ లారీ యూనియన్లో జరిగిన గొడవలో గాయపడిన వ్యక్తి పోలీసు వారికి కంప్లైంటు చేసినా ఇప్పటివరకు రెజిస్టరు చేయలేదనీ ఈఘటనకు పత్రికా విలేఖరులే సాక్షులన్నారు. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నామనీ ఒకవేళ మావాదన తప్పు అయితే న్యాయస్థాన్మ కొట్తివేస్తుందనీ అంతే కానీ కేసే కట్టనంటే కుదరదన్నారు. ఎన్నికల సంఘం వారు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టారనీ వందరోజుల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందనీ అధికారులు చట్టాన్ని గౌరవిస్తూ అమలు చెయకపోతే అదే చట్టం వారిని శిక్షిస్తాదనీ, హక్కులకోసం ప్రజలు పోరాడుతారనీ వారితరపున జనసేన పోరాడతాదని హెచ్చరించారు. బంకువారికి వారి సొమ్ము, పెట్రోలు డీజిలుని తక్షణమే తిరిగి ఇప్పించాలనీ లేకపోతే అందులో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాల ఆకలి కేకలకి మీరే బాధ్యత వహించాలన్నారు. ప్రజాప్రతినిధులకి, వారి అనుచరులకి , అధికారులకి ఒకటే చెపుతున్నాం మారండి పద్ధతి మార్చుకోండి లెకపోతే మీకు ట్రాన్స్ఫర్లు ఉండవు ప్రజలే మిమ్మల్ని పక్కన కూర్చోపెడతారని హెచ్చరించారు. బాధితుడు రామక్రిష్ణ మాట్లాడుతూ ఎటువంటి గొడవకానీ, వ్యక్తిగతంగా మరే కారణాలు లేవనీ కొవ్వూరు నుండీ వచ్చి ఇక్కడ బంకు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నా అనీ మాకు తీసుకెళ్ళిన సొమ్ము, ఆయిలు తిరిగి ఇప్పించవలసినదిగా కోరారు. జరిగిన దుర్ఘటనని చిక్కాల దొరబాబు తీవ్రంగా ఖండించి సత్వర న్యాయం అందించాలన్నారు.