శంకుపర్తి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకొనేది లేదు: జనసేన మురళి

అనంతగిరి: శంకుపర్తి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని జనసేన మురళి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గుమ్మకోట పంచాయతీ శంకుపర్తి గ్రామ రెవిన్యూలొ సుమారుగా 220 ఎకరాలు 64 రైతుల జిరాయితి భూమిని అమాయక రైతులను జిపిఆర్ అంటే తెలియని రైతులను తాగించి చెట్టు భూమి నీదే ఒక్క నీడ మాత్రమే మాకు కావాలని ప్రజలను నమ్మించి తాగించి వేలిముద్ర వేయించి భూములు దోచుకుకున్నారు. రవి బాబు అతని బినామీ వేలు పూరి మారుతి చంద్రమోహన్ రవిబాబు అనుచరులు రైతులు చనిపోయినప్పటికి నివసించి ఉన్నారు అని రిజిస్టర్ ఆఫీస్ ఆపిడివిట్ ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంత ఘోరంగా భూ దోపిడీజరుగుతుంది. అంటే ఈ విషయంతో చాలా తేటతెల్లముగా తెలుస్తుంది పైగా రైతుల పేరు మీ 1బి నీ జతపరిచి 10 సంవత్సరాల క్రితం చేసిన జిపిఆర్ఎస్ ను రైతులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. అలాగే అమాయక రైతులను మాత్రం పది సంవత్సరాల నుండి డబ్బులు ఇవ్వకుండా మీ భూములు రిజిస్ట్రేషన్ అవలేదు మీ భూములు మీవే అనే మోసం చేసి యున్నారు. రవిబాబు బినామీ మారుతీ చంద్ర మోహన్ అనే వ్యక్తి రైతుల ద్వారా పట్టాలు లాక్కుని వేరే వ్యక్తులకు ఈ భూమిని అమ్మివేసి ఉన్నాడు. ఆ కొన్న వ్యక్తి ఎవరు అన్నది రైతులకు మొఖం కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నదని జనసేన మురళి అన్నారు.