ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజల్లో చైతన్యం రావాలి: శివ కోటి యాదవ్

  • వాయిస్ ఆఫ్ జనసేన నర్సంపేట నియోజకవర్గం-వరంగల్

తెలంగాణ, నర్సంపేట: ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజల్లో చైతన్యం రావాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జీ శివ కోటి యాదవ్ పేర్కొన్నారు. శనివారం శివ కోటి యాదవ్ నర్సంపేట జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం ఎన్నికల ముందు ఓట్ల కోసమే అన్నట్లుగా ప్రభుత్వ పథకాల హడావిడి, తమ పార్టీ కండువా కప్పుకున్న వారికే పథకాలకి అర్హులు అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహార శైలి. పూర్తిస్థాయిలో అర్హులందరికీ నోచుకొని దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్లు. తమ హక్కుగా పొందే ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు పంచేందుకు అధికార ప్రజా ప్రతినిధులకు చేతివాటం ఎందుకు? లబ్ధిదారుల నుంచి వేలల్లో, లక్షల్లో స్వాహా. పథకాల ప్రచారంలో ఆర్భాటం ఎక్కువ, అమలులో, ఆచరణలో తక్కువ అన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. పథకాల సంపూర్ణ అమలులో జాప్యం. ఎన్నికల కోడ్ రాగానే సాకుతో పథకాలు నిలిపివేసి కాలయాపనం చేసే ధోరణిలో ప్రభుత్వం. ప్రజలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా చూసే సాంప్రదాయ పార్టీలకి మద్దతు తెలుపుతున్నంతకాలం సంపూర్ణభివృద్ధికి నోచుకోలేరు. ప్రశ్నించే తత్వం లేనిచోట బానిసత్వం కొనసాగుతుంది. వ్యవస్థలో మార్పు కోసం, అవినీతి నిర్మూలన దిశగా, ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు వస్తున్న మా జనసేన పార్టీ వైపు కూడా ప్రజలు ఒకసారి ఆలోచించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజవర్గంలో మద్దతు ఇచ్చి గెలిపించండి. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం, ప్రజలందరికీ సేవకులుగా అండగా నిలుస్తాం. మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ తెలపడం జరిగింది.