ప్రజలకు మెరుగైన చోట ఇళ్ళు మంజూరు చేయాలి: దారం అనిత

మదనపల్లె, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ.. ప్రతి పేద వానికి సొంతింటి కల తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ళు మంజూరు చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఘనంగా జగనన్న కాలనీలు అంటూ.. కేవలం ఇళ్ళు కాదు ఊళ్లు నిర్మిస్తాం అని చెప్పింది. వాస్తవంలోకి వస్తే ఊరికి దూరంగా, చెరువుల పక్కన, స్మశానాలలో, కొండ గుట్టల్లో ఇళ్ళు మంజూరు చేయడంతో లబ్దిదారులు అయోమయంలో పడ్డారు. అనంతపురం రూరల్‌ మండలం కామారుపల్లి గ్రామ పరిధిలో చెరువుకు సమీపంలో.. పుట్లూరు మండలంలో కొండగుట్టల్లో.. ఉరవకొండ శివారులో స్మశానవాటికలో సుమారు 67,772 మందికి ఇళ్లు హడావిడిగా మంజూరు చేశారు. జగనన్న కాలనీలలో సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రెండేళ్లలో ఒక్క సదుపాయం కూడా కల్పించలేదు. చిత్తశుద్దితో ప్రజలకు మంచి చేయాలి గానీ ప్రచార ఆర్భాటం కోసం చేస్తే ఇలానే ఉంటుంది. ప్రజలకు మెరుగైన చోట ఇళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.