మొద్దు నిద్ర వదిలి ప్రజల సమస్యలను పరిష్కారించాలి

  • తాగునీటి పైప్లైన్ ఉండదు కానీ మద్యం షాప్ మాత్రం ఉంటుంది

గుంతకల్: గుంతకల్ పట్టణంలోని దోనుముక్కలలో ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు 10 రోజులకు పైనే అవుతున్నా నీళ్లు లేక ట్యాంకులు కూడా రానటువంటి పరిస్థితి. దాదాపుగా ఇదే పరిస్థితిపై మూడుసార్లుగా ఇలా రోడ్లమీద కొచ్చి ధర్నా చేయడం జరిగినది. ఈ అధికారులు మాటలు చెప్పి తప్పించుకోవడమే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఈ రోజు మహిళలు రోడ్లమీదకు వచ్చి బిందెలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాయకులకు అధికారులకు అర్థం కావడం లేదు. ఇకనైనా ఈ అధికారులు, నాయకులు మొద్దు నిద్ర వదిలి బయటకు వచ్చి ప్రజా సమస్యలు కనుక్కొని తక్షణ పరిష్కారం చేయండి. నియోజకవర్గ శాసనసభ్యులు మరి స్టేజి ఎక్కితే మా జనసేన పార్టీ అధ్యక్షులు గారిని విమర్శించడానికి పనికొస్తారే తప్ప గుంతకల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవు కనీసం సైడ్ కాలవల్లేవు త్రాగడానికి పైప్ లైన్ లేక నీళ్ల ట్యాంకుల ద్వారా నీళ్లు తెప్పించుకుంటుంటే అర్థం చేసుకోండి ప్రజలారా
మరి మహిళలైతే బిందెలు పట్టుకొని రోడ్లమీద కొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మద్యం దుకాణాలు తీర్చుకోవడానికి మాత్రమే పనికొస్తారే కానీ నీటి సౌకర్యం కల్పించడానికి పనికిరారు అని అక్కడ నివాసముంటున్న ప్రజలు అంటున్న మాటలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి అభివృద్ధి వైపు చూపియండి‌.