మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపిన కృత్తివెన్ను జనసైనికులు

పెడన, అమరావతి రైతుల మహాపాదయాత్ర ఈ నెల 23 వ తేదీన 9 గంటలకు పెడన నియోజకవర్గంలో ప్రవేశంచనున్నది కావున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అమరావతి రైతులకు మద్దతుగా పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నుండి మనం కూడా అడుగులో అడుగు కలుపుతూ కదంతొక్కుదాం. మన పార్టీ తరఫున అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిద్దాం. బుధవారం కృత్తివెన్ను మండలం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు సమావేశమయ్యి, 23 జరగబోయే అమరావతి రైతుల మహా పాదయాత్రకు జన సమీకరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి కూనసాని నాగబాబు, కృత్తివెన్ను మండల అధ్యక్షులు తిరుమణి రామాంజనేయులు, నాగమల్లేశ్వరరావు, కొప్పినేటి నరేష్, సురేష్, కాజా మణికంఠ, పిన్నింటి రాంబాబు, పుప్పాల సూర్యనారాయణ, చీట్ల నవీన్ కృష్ణ, ముదినేటి రామకృష్ణ, పినిశెట్టి రాజు, పసుపులేటి రాజేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.