శ్రమదానంలో సరిలేరు మీకెవ్వరు అనిపించుకున్న జనసైనికులు…!!

క్రియాశీలక సభ్యులు కిట్లు అందించిన మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలం.. వన్నెపూడి గ్రామంలో
నాదారి రహదారి అని ప్రభుత్వం రహదారులను పట్టించుకో కుండా పాలించుకుంటూ పోతుంది రోడ్లు ఎక్కడ చూసినా గుంతలకు గురై వాహనాల మాట అటున్నా.. ప్రజలు నడపలేని విధంగా గుంతలు పడిపోయాయి. వాటి మాట అలాఉన్నా చదువుకొనే పిల్లలు నడిచే స్కూల్ రోడ్లు కూడా పట్టించుకోని పరిస్థితిని వన్నెపూడి గ్రామంలో ఎదురైయింది. అధికారులను అడిగి అడిగి అలసిపోయి గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామ జనసైనికులు తమ సొంతఖర్చుతో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే రోడ్డు మార్గం గ్రేవెల్ తెప్పించి పాఠశాల రోడ్డు మార్గంవేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తమ జనసేన పార్టీ జనసైనికులు చేసిన ఈ శ్రమదానానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకీనీడి శేషుకుమారి అభినందిస్తు పారతో మట్టిని తీసి బేషిన్ లో వేసి శ్రమదానంలో తానూ భాగాస్వామి అయ్యారు. ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియతో మాట్లాడుతూ వన్నెపూడి గ్రామంలో పాఠశాలవెళ్ళే రోడ్డు మార్గం పూర్తిగా గుంతలుపడడంతో ప్రభుత్వం చేయవలసిన పనిని మా జనసైనికులు తలొక చెయ్యి వేసి తమ సొంత ఖర్చుతో శ్రమదానం చేసి.. స్కూల్ రోడ్డు మార్గాన్ని సరిచేసారని.. ఈ హైస్కూల్ కి ఇలా కొడవలి పోతురునుండి వచ్చే విద్యార్థులు, ఇదే మార్గాన వస్తారని స్కూల్ పిల్లలు నడిచే రోడ్డుకూడా వేయలేక పోయిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం తలపెట్టడం జరిగిందన్నారు. నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అభివృద్ధి కి లక్షలు సొమ్ము రిలీజ్ చేసుకుని పైపైన మెరుగులు దిద్ది సొమ్ము ని దుర్వినియోగం చేసారుగాని రోడ్డును నిర్మాణం చేయలేక పోయారన్నారు. తదుపరి స్కూల్ సందర్శించిన ఎస్ కుమారి పౌష్టికాహారం పై ఉపాధ్యాయులను ఆరా తీసారు పెరిగే పిల్లకు సరైన ఆహారం అందించడంలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని స్కూల్ పరిసరాలువరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు. అక్కడ నుండి గ్రామం చేరి క్రియాశీలక సభత్వ కిట్లును పంపిణీ చేసారు. అలాగే ఈ సభ్యులు అందరూ పార్టీకి వెన్నుముకలా ఉండి గ్రామంలో జనసేనను బలపరిచి.. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, మరణించిన కౌలు రైతుల కుటుంబానికి అండగా ఉంటున్న కార్యక్రమం కోసం ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో.. గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, పి.ఎస్.ఎన్ మూర్తి, దొడ్డిపట్ల గణేష్, దొడ్డిపట్ల రాంబాబు, పచ్చిపాల శివ, పచ్చి పాల దత్త, బొల్లు రాజా, మొయిళ్ళ శివగంగా, గొల్లపల్లి కృషర్జున, దొడ్డిపట్ల వీరకృష్ణ, మేళం దత్త, యర్రా సతీష్, డేగల స్వామి, అడబాల వీర్రాజు, గ్రామస్తులు, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.