పేరాబత్తుల రాజశేఖరంని భారీ మెజారిటీతో గెలిపించాలి

  • నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్

ఏలూరు నియోజకవర్గంలోని 4, 5వ డివిజన్ పరిధిలోని వెన్నవల్లి వారి పేట, టీచర్స్ కాలనీ, లంబాడి పేట, శ్రీరాంనగర్ కాలనీ, చెంచుల కాలనీ, వినాయక నగర్, శివకామాక్షి కాలనీలో 35 వ డివిజన్ పరిధిలోని కొత్తపేటలో ఉన్న కంకణాల వారి వీధి, గొర్రెల వారి వీధి, 12 పంపుల సెంటర్ మెయిన్ రోడ్డులో, 40 వ డివిజన్ పరిధిలోని కరణం వారి వీధి, దాసరి వారి వీధి, లావేటి వారి వీధి, సబ్బులు వారి వీధిలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్ ల ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికే మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఓటర్లను వారు ప్రార్థించారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్.డి.ఏ కూటమి తరుపున పోటీ చేయనున్న పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యతను ఓటును వేసి గెలిపించాలని స్థానిక కూటమి పార్టీల నాయకులతో కలిసి ఓటర్లను అభ్యర్థించి, వారికీ కరపత్రాలు అందించి పేరాబత్తుల రాజశేఖరంకి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, బోండా రాము నాయుడు, కూనిశెట్టి మురళీ కృష్ణ, వేముల బాలు, 1 టౌన్ మహిళ కార్యదర్శి వెలగా గాయత్రి మరియు ఉమ్మడి కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment