అంబాజీపేట మండలం, మాచవరం గ్రామంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. మాచవరం 4వ సచివాలయం వద్ద ₹4 కోట్ల వ్యయంతో జల జీవన్ మిషన్ పైపులైన్, ఇంటింటికి త్రాగునీటి కొళాయిల ఏర్పాటు పనులకు నేడు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “మాచవరం గ్రామస్తుల కోరనుబట్టి గెలిచిన వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కృషి ప్రారంభించాను. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు తగిన స్థాయిలో స్పందించలేని గత పాలకులతో పోల్చుకుంటే, ఇప్పుడైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది” అని అన్నారు. పొతాయిలంక ప్రధాన ప్రాజెక్ట్ నుంచి ఐదు వాటర్ ట్యాంకులకు నీరు ఎక్కించి, ప్రతి ఇంటికీ శుభ్రమైన త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా పైప్‌లైన్ లేదా కొళాయిలు అవసరమైన ప్రాంతాల వివరాలను పంచాయతీకి తెలియజేయాలని గ్రామస్థులను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment