పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

పవన్ కళ్యాణ్ పై వ్వక్తి గత విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి హితవు పలికారు. ‌శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న దర్నాకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే ఆయనపై వ్వక్తిగత విమర్శలు చేయడం వైసిపి నాయకులకే చెల్లిందన్నారు.‌ పవన్ కళ్యాణ్ ప్రజలకు దత్తపుత్రుడు కాని ఓ వ్వక్తికో, ఓ పార్టీకో, ఓ సంస్థకో కాదనే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు గుర్తించాలని హితవు పలికారు. రైల్వే లైన్, మదనపల్లె జిల్లా విషయంలో వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మ్యాచింగ్ గ్రాంటు చెలించడంలో వెనకడుగు వేసి ఈ‌ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసి రైల్వే లైన్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‌ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, జగదీష్, ఫాజిల్, ఫణింద్ర కుమారి, సనావుల్లా, పద్దు టైగర్, రెడ్డెమ్మ, గజ్జల రెడ్డెప్ప, పవన్ కుమార్, మారప్పనాయక్, లోకేష్, నవీన్ పాల్గొన్నారు.