ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్… నోటీసులు జారీ చేసిన హైకోర్టు

ఇటీవల ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగియడంతో, నీలం సాహ్నీని నూతన ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించడం తెలిసిందే. అయితే, ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నీలం సాహ్నీకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారుకు, ఇతర ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

కాగా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31తో పూర్తి కాగా, నీలం సాహ్నీ ఆపై ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. పదవిలోకి వచ్చిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఆమె నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. చివరికి ఏపీలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.