*మందమర్రిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం
*జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
మందమర్రి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని, మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, “అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించి, ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు. కానీ మందమర్రిలో మూడు దశాబ్దాలుగా మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం బాధాకరం” అని పేర్కొన్నారు. ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కాకపోవడం, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, పలు ప్రాంతాల ప్రజలు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగినపుడే ప్రజలకు ప్రాతినిధ్యం లభిస్తుందని, అభివృద్ధి జరిగి నాయకత్వం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ ఆశయాలను గుర్తు చేస్తూ, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపే అవసరాన్ని హైలైట్ చేశారు.
Share this content:
Post Comment