జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు చిక్కం భీముడు ఆధ్వర్యంలో, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్ ని కలిసి రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యపై వినతిపత్రం సమర్పించారు. రైతులు తెలిపిన మేరకు, మేజర్ డ్రెయిన్ ద్వారా సముద్రపు ఉప్పు నీరు ప్రవహిస్తూ పంటకాలువలు మరియు చిన్న కాలువల్లోకి చేరి వారి పంట భూములు ఉప్పు నీటి ప్రభావానికి లోనవుతున్నాయి. దీనివల్ల రైతులు సంవత్సరానికి ఒకే ఒక్క పంటకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరుతూ, రైతులు క్రింది సూచనలు చేశారు. రెండు మేజర్ డ్రెయిన్‌లు కలిసే ప్రదేశంలో ఆటోమేటిక్ రెగ్యులేటరీ సిస్టమ్‌తో పవర్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలి, డ్రెయిన్‌లను పూడికతీసి మరమ్మతులు చేయాలి, గట్లు బలపరచాలి, ఇసుక మేటలను తొలగించాలి. ఈ చర్యల ద్వారా ముంపు సమస్యను నివారించి, ఉప్పు నీటి ప్రభావం లేకుండా రైతులు రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటూరి రవి, నల్ల బాపండి, చిక్కం పెద్దబ్బులు, నల్ల సత్యనారాయణ, బండారు తదితరులు పేర్కొన్నారు.
Share this content:
Post Comment