ఉప్పునీటి సమస్యను పరిష్కరించండి!

*సమస్యకుశాశ్వత పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే, ఎంపీకి వినతిపత్రం ఇచ్చిన రైతులు

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని మమ్మిడివరం ప్రాంత రైతులు, చిక్కం భీముడు ఆధ్వర్యంలో గౌ. ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, ఎంపీ గంటి హరీష్ మాధుర్‌లను కలిసి ఉప్పునీరు వల్ల పంట నష్టాలపై విన్నవించారు. మేజర్ డ్రెయిన్ ద్వారా సముద్రపు ఉప్పు నీరు ప్రవహించి పంట కాలువలలోకి చేరి పిల్ల కాలువలను చేరుతోంది. దీంతో భూముల్లో కేవలం ఒకే పంట పరిమితమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. రెండో పంట సాగు చేయలేని పరిస్థితిలో ఉన్న తమకు శాశ్వత పరిష్కారంగా రెండు మేజర్ డ్రైన్ల కలయిక ప్రాంతంలో ఆటోమేటిక్ రెగ్యులేటరీ సిస్టం, పవర్ లిఫ్ట్ ఏర్పాటుతో పాటు, డ్రైన్లకు పూడిక తొలగింపు, మరమ్మత్తులు, గట్ల బలపరిచే పనులు చేపట్టాలని కోరారు. ఇసుగ మేటలను తొలగించి ఉప్పునీటి ముంపునకు చెక్ పెట్టాలని, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి వినతి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు చిక్కం భీముడు, మోటూరి రవి, నల్ల సత్యనారాయణ, నాగులపల్లి రాజు, తాళ్ల లలితా రవికుమార్, గని శెట్టి లలితా శ్రీనివాస్, అడబాల సత్యనారాయణ, అర్లపల్లి దుర్గ, తూము రమేష్, ఆకేటి వెంకన్న, గొల్ల కోటి వెంకటేష్, బిక్కిన ఏసు, తాళ్ల రవి, లక్కీ ఆకుల, మారిశెట్టి రమేష్, పెయ్యిల చిట్టిబాబు, సలాది గణపతి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment