మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం

ప్రకాశం జిల్లా, పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి జిల్లా సాధన సమితి నాయకులు ర్యాలిగా మొదలై కోర్టు సెంటర్ కూడలిలో గల డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ సైదావలి, టీడీపీ నాయకులు తాళ్ళపల్లి సత్యనారాయణ, షేక్ మౌలాలి, బీజేపీ నాయకులు పి.వి.కృష్ణారావు, ఎంపిజే నాయకులు అబ్దుల్ రజాక్ మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం టౌన్ అధ్యక్షుడు షేక్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షుడు తాటి రమేష్, జనసేన పార్టీ నాయకురాలు పూజ లక్ష్మి, నాయకులు గుంటూ రత్నకుమార్, పిన్నేబోయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసరావు, పోశంశెట్టి వెంకట్రావు, జానకిరామ్ సింగ్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.