అక్రమ త్రవ్వకాలపై కలెక్టర్ కి వినతిపత్రం

  • మల్లయ్య స్వామి గట్టు అక్రమ తవ్వకాలకి పాల్పడుతున్న తిరువూరు ఎమ్మెల్యే, కొండపర్వ గ్రామ సర్పంచ్ పై చర్య తీసుకోవాలి – జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ
  • విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి స్పందనలో ఫిర్యాదు చేసిన అఖిల పక్ష నాయకులు

విసన్నపేట, సోమవారం విజయవాడ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి కొండపర్వ గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాలపై అఖిలపక్షం నాయకులు ఫిర్యాదు చేసారు. గత సంవత్సర కాలంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో మల్లయ్య స్వామి గట్టును గ్రామ సర్పంచ్ స్వాహా చేసారని మైనింగ్ శాఖ అనుమతిలేకుండానే తవ్వకాలు జరిపారని దీనిపై విచారణ జరిపి తగు చర్య తీసుకోవాలని సామాజిక కార్యకర్త బోట్ల శివ సత్యనారాయణ విసన్నపేట తహసీల్దార్ కి, విజయవాడలో మైనింగ్ శాఖవారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించి పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సర్వే నెంబర్ 472 /1 ప్రభుత్వ గట్టు పోరంబోకులో మట్టి తరలించుకు పోతుంటే గ్రామ కార్యదర్శి, విఆర్వో, మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదనీ తెలిపారు. మైనింగ్ శాఖ, జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కొండపర్వ గ్రామాన్ని పరిశీలించి కొండలు పిండేస్తున్న అక్రమ త్రవ్వక దారులపై విచారణ జరిపి చర్యలు చేపట్టి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు త్వరలో గ్రామాన్ని సందర్శించి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఇది జరగకపోతే మల్లయ్య స్వామి గట్టు వద్ద ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని శివరామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండపర్వ గ్రామ సామాజిక కార్యకర్త బోట్ల శివ సత్యనారాయణ, సి.పి.ఐ.ఎం.ఎల్ రాష్ట్ర నాయకులు డి.హరినాథ్, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎం.పి.పి వాసం మునియ్య, సీపీఎం మండల కార్యదర్శి విసంపల్లి నాగరాజు, జనసేన నాయకులు, మాల మహానాడు, గిరిజన సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.