నెల్లూరు నగర స్ట్రీట్స్ లో వీధి ఆవుల సంచారం, డ్రైనేజీ వ్యర్థాల అక్రమ పారుదలపై జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై తిరుగుతున్న ఆవుల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. పెన్నా గర్భం వద్ద ఉన్న దేవస్థానం రోడ్డులో అక్రమంగా డ్రైనేజీ వ్యర్థాలు పారబోస్తుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విమర్శించారు. అక్రమంగా వ్యర్థాలు పారేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా, డివిజన్ నాయకులు, ఐటీ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment