చండ్రగూడెం సమస్యలపై ఎమ్మెల్యేకి వినతిపత్రం

మైలవరం: స్థానిక చండ్రగూడెం, గ్రామపంచాయతీలో సుమారు 450 మంది లబ్ధిదారులకు నేటికి కూడా ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయించలేదని, గ్రామానికి దగ్గరలో భూమిని కొని లబ్ధిదారులకు అందజేస్తామని గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చి మరిచారని, చండ్రగూడెం వచ్చిన స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు శీలం బ్రహ్మయ్య గుర్తు చేశారు. వెంటనే లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని మరియు స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసి, ఈ సమస్యలపై ఎమ్మెల్యేకి బుధవారం జనసేన మరియు బిజెపి నాయకులు వినతిపత్రం సమర్పింహారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, జనసేనపార్టీ నాయకులు కూసుమంచి కిరణ్ కుమార్, మాదినేని చిన్న రామారావు, మర్రి కొండలరావు, జనసైనికులు శీలం కోటి, అక్షింతల తిరుపతిరావు, శీలం చందు, కొండూరు సతీష్, శీలం కొండలరావు తదితరులు పాల్గొన్నారు.