వంగర మండలంలో రైతుల సమస్యలపై మండల రెవిన్యూ అధికారికి వినతిపత్రం

  • రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో అధికార ప్రభుత్వ నిర్లక్ష్యం.
  • పది సంవత్సరాలుగా నిలిచిపోయిన రుషింగి-కిమ్మి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం.

రాజాం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, వంగర మండలం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు వంగర మండలంలో పలు ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించడానికి సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా వంగర మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ పర్యటన సందర్భంగా కొప్పరవలస, రాజులగుమడ, సీతారాంపురం మరియు పలు గ్రామాల రైతులు ఎన్ని రాజు గారి వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసారు. ఇంతవరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు మరియు మద్దతు ధర విషయంలో తీరని అన్యాయం చేస్తున్న కారణంగా మాకు ఆత్మహత్య శరణ్యం అని సుమారు 100 మంది రైతు కుటుంబాలు వాళ్ళ గోడు వినిపించుకున్నారు. వాళ్ళ సమస్య విన్న ఎన్ని రాజు మాట్లాడుతూ రైతులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల కోసం వంగర మండలంలో వెంటనే నిరసన కార్యక్రమం చేపట్టి మండల రెవిన్యూ అధికారికి వినతి పత్రం ఇచ్చి తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని రైతుల తరపున డిమాండ్ చేసారు. ఈ విషయంపై కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి అధికార ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించి రైతుల సమస్య పరిష్కారం అయ్యేలా చేయాలని మీడియా ముందు కోరడం జరిగింది. అలాగే పది సంవత్సరాలుగా నిలిచిపోయిన రుషింగి-కిమ్మి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ప్రజలందరి సమక్షంలో నిలదీయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ మా కష్టాలు తీరాలంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ మండలంలో రుషింగి గ్రామంలో కొన్ని కుటుంబాలతో పాటు సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి ముందుకు రావటం జరిగింది. ఈ పర్యటనలో ఎన్ని రాజు తో పాటు వంగర మండల జనసైనికులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు రాజాం నియోజకవర్గానికి చెందిన మిగతా మూడు మండలాల జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటన విజయవంతం చేయటం జరిగింది.