హైదరాబాద్‌లో రూ.110 దాటిన పెట్రోల్‌ ధర!

దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆదివారం (17-10-2021) లీటర్‌ పెట్రోలుపై గరిష్ఠంగా 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల వరకు ఎగబాకింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 దాటింది. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటేసింది. దేశంలో చాలా ప్రాంతాల్లో డీజిల్‌ సైతం రూ.100 దాటింది. ముంబయిలో లీటరు పెట్రోలుకు ఆదివారం రూ.111.77, దిల్లీలో 105.84 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఇలా ఉన్నాయి…

నగరం పెట్రోల్‌(రూ.లలో) డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌ 110.09 103.18

గుంటూరు 112.38 104.83

విజయవాడ 112.38 104.83

విశాఖపట్నం 110.90 103.43

దిల్లీ 105.84 94.57

ముంబయి 111.77 102.52

చెన్నై 103.01 98.92

బెంగళూరు 109.53 100.37