హైకోర్టులో పునః ప్రారంబిస్తున్న భౌతిక విచారణ

కరోనా వైరస్​ కారణంగా నాలుగు నెలల నుండి  భౌతిక విచారణను తగ్గించిన హైకోర్టు సెప్టెంబర్​ 7 నుంచి తిరిగి పరిమిత సంఖ్యలో భౌతిక విచారణ చేపట్టాలని పేర్కొంది. అగ్రిగోల్డ్​, అక్షయ గోల్డ్​ కేసులను అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆర్​ఎస్​ చౌహన్​, బి.విజయ్​సేన్​ రెడ్డిల ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ల అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం సెప్టెంబర్​ 7 నుంచి పరిమితంగా భౌతిక విచారణలు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపింది.