శ్రీశ్రీశ్రీ సింహాద్రి అప్పన్న స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న పిల్లా శివశంకర్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, శ్రీరాంపురం గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా గుడి కమిటీ వారి ప్రేమపూర్వక ఆహ్వానం మేరకు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆదేశానుసరం వారి అన్నయ్య పిల్లా శివశంకర్ శ్రీశ్రీశ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని 5016/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, ఆమదాల అప్పారావు, చికట్లా సింహాచలం, బండి అప్పారావు, బండి కృష్ణార్జున రావ్, పేర్ల మణికంఠ, పేర్ల వీరమణికంఠ, ఆమదాల అప్పన్న, సాయ్యేటి స్వామి, పాటి శ్రీను, నాగల్ల నరేంద్ర, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.