పలాస నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పలాస నగరానికి కూతవేటు దూరంలో నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన ఉన్న రిజర్వు ఫారెస్ట్ తోటల్లో పలాస నగర వనాన్ని ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో పలాస నగర వనాన్ని సందర్శించి పనులను జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ పరిసీలించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో శ్రీకాకుళం జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కోటి ఇరవై లక్షల వ్యయంతో పలాస నగర వనాన్ని ప్రజలకు అందించినటువంటి ఘనత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లది అన్నారు. ఇలాంటి అద్భుతమైన మంచి నగర వనాన్ని ఏర్పాటు చెయ్యటంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త డాక్టర్ దుర్గారావు, స్థానిక బిజెపి నాయకులను ప్రజలు అభినందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి, నందిగామ మండల అధ్యక్షులు చిరంజీవి, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం నాయకులు మీసాల రవికుమార్, గుమ్మడి శాంతారావు, పలాస నియోజకవర్గ ముఖ్య నాయకులు కృష్ణారావు, దువ్వాడ వంశీకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment