పలు కుటుంబాలను పరమర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ గురువారం తాళ్ళరేవు మండలం, తాళ్లరేవు గ్రామంలో అకాల మృతి చెందిన పంపని కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మరణించిన గెద్దాడ లక్ష్మణరావు కుటుంబ సభ్యులు పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, గూడాల నాని, రాష్ట్ర కార్యదర్శి జెక్కం శెట్టి బాలకృష్ణ, రాయుడు శ్రీనివాస్, ఉండ్రు సత్తి నాయుడు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.