వరద ముంపు లంక గ్రామాల ప్రజలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గోదావరి వరదకు ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలను పరామర్శించి వారి యోగ క్షేమలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ముమ్మిడివరం మండలం లంక అఫ్ ఠాణేలంక, గురజాపులంక, కునార్లంక సలాదివారిపాలెం, ప్రాంతాలలోని ప్రజలను కలిసి ప్రభుత్వం నుండి సదుపాయాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని అందరినీ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల అధ్యక్షులు గోలకోటి వెంకటేశ్వరరావు, గోదాశి పుండరీస్, జక్కంశెట్టి పండు, సానబోయిన మల్లికార్జునరావు, గోలకోటి సాయి బాబు, బొక్కా రాంబాబు, జక్కంపూడి కిరణ్, బొక్కా శ్రీను, యల్లమిల్లి నాగేశ్వరరావు, పెన్నాడ శివ, వంగా విజయ సీతారాం, బండారు సతీష్ మొదలగు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.