పలుకుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వాసం భైరవమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు అదే గ్రామానికి చెందిన సుంకర వెంకయ్య గారు మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు వేట్లపాలెం గ్రామానికి అకాల మరణం చెందిన మేడా మావుళ్ళ స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, బీమాల సూర్య నాయుడు, ఒగురి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, సంసాని పాండురంగ, విళ్ళ శివ, ఒగురి నూతన బాబు, పిల్లి గోపి, దంగేటి రమణ, దంగేటి ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.