పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, టి.కొత్తపల్లి గ్రామంలో అకాల మరణం చెందిన షేక్ హిబ్రహీం కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఉద్దిశ నరసింహ మూర్తి వారి భార్య రామలక్ష్మి అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు హార్ట్ ఎటాక్ తో మరణించిన ఉద్దేశం వెంకట సరస్వతిరావు (దొరబాబు) వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ దేవ్ రాంబాబు, ఉద్దిశ వీరబాబు, సలాది రాజా, చెల్లుబోయిన చినబాబు, లంకినపల్లి జమ్మి, గుబ్బల బాబ్జి, గంజా యేసు, లంకినపల్లి వెంకటేశ్వరరావు, రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.