*జనసేన పార్టి ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త కోర్రపాటి నాగేశ్వరరావు
*ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 40వ డివిజన్ పెద్ద పలకలూరు గ్రామంలో జనసేన పార్టీ పిఠాపురం ఆవిర్భావ దినోత్సవం సభ పోస్టర్‌ను జనసేన సమన్వయకర్త కోర్రపాటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇప్పటివరకు పోరాటాలు చేశాం – ఈసారి ఉత్సవం చేద్దాం” అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మార్చి 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో జరిగే 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ, ఈ సభ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పారు. జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ, పిఠాపురం సభపై దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి ఉందని, ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ సభకు వచ్చే జనసేన కార్యకర్తలకు భోజన వసతులు, మజ్జిగ, మంచినీరు వంటి అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. 47వ డివిజన్ కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ కార్యకర్తలు స్వచ్చందంగా తమ నిధులతో సభకు వెళ్లడం జనసేన గొప్పతనానికి నిదర్శనమని, తొలి విజయానంతరం జరుగుతున్న ఈ సభను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ నాయకులు నాగినేని సునీల్ కుమార్, విన్నకోట మల్లికార్జునరావు, 48వ డివిజన్ అధ్యక్షుడు అంబటి శివకుమార్, అడపాల శివ నాగేశ్వరరావు, అల్లం బ్రహ్మం, కటారి గిరి, గణిత సాయి తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment