రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడం ఆనందదాయకం: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు కేంద్ర ప్రభుత్వం 27.13 కోట్లు నిధులతో అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా వర్చువల్ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసులోవిలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రం నుండి మన ఎంపీ రఘురాం కృష్ణంరాజు కృషి వలన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నరసాపురం భీమవరం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ల అభివృద్ధి కొరకు నిధులు తీసుకురావడంలో మన ఎంపీ రఘురామకృష్ణం రాజు కృషి మరువలేనిది అన్నారు. మన తాడేపల్లిగూడెం స్టేషన్ కు ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు నిధులు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. అయితే గతంలో మన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో సరైన వసతులు లేవని ఇక్కడ సరైన కుర్చీలు గాని టాయిలెట్స్ కానీ లిఫ్టు సరిగా పనిచేయకపోవడం గాని ఇలాంటి విషయాలపై చర్చించి ఇక్కడకు నిధులు తీసుకురావాలని కోరమని తెలిపారు. ఈరోజు ఆయన దయవల్ల మన రైల్వే స్టేషన్ కు ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడం మన తాడేపల్లిగూడెం ప్రజల తరఫున మేము ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇక్కడ జిల్లాకు నడిబొడ్డున ఇటు డెల్టా ప్రజలకు ఇటు అప్లెంట్ ప్రజలకు మరియు తాడేపల్లిగూడెం వ్యాపార పరంగా ఇటు ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నందువల్ల ఇక్కడ కచ్చితంగా వందేమాతరం ఎక్స్ప్రెస్ రైలు ఇవ్వవలసిందిగ మా తరఫున మా ప్రజల తరపున ఈ ఒక్క విజ్ఞప్తిని మన్నించి హాల్టిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామని అన్నారు. అయితే మన ఎంపీ రఘురాం కృష్ణంరాజు మన నియోజకవర్గ అభివృద్ధి చేయటంలో భాగంగా కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 3.25 కోట్లు నిధులు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. అమృత్ భారత్ లో భాగంగా మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు నిధులు ఇచ్చినందుకుగాను ప్రధాని నరేంద్ర మోడీకి ఎంపీ రఘురాం కృష్ణంరాజు కి మా నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీ, రామకృష్ణ, రమేష్, విజయ్, మనికుమార్, మోహన్, సూరీ, ముఖేష్, ముత్యాలుతదితరులు పాల్గొన్నారు.