ఏలూరు జిల్లా, టి.నర్సాపురం మండలంలో మక్కినవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్.డి.ఏ కూటమీ నాయకులతో కలిసి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రస్తుత గవర్నమెంట్ సి.ఎం నారా చంద్రబాబు నాయుడు విజన్ తో ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నారు, ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలలోపే డిఎస్సీ జాబ్స్ తీసిన ఘనత మన ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వానిదే, గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎంత ఇబ్బంది పెట్టిందో చూశారు, కాబట్టి ఇదే మనకు మంచి అవకాశం, మన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మంచి విలువలతో కూడియున్న వ్యక్తి, వీరిని గెలిపిస్తే మనకు మంచి జరుగుతుంది, కావున భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ అడపా నాగరాజు, జనసేన నాయకులు కార్యకర్తలు, టిడిపి నాయకులు శ్రీరామ్ మూర్తి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment