Araku: విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీలు దుర్మార్గం – మాదాల శ్రీరాములు

విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీలు దుర్మార్గం..!

విద్యార్థులపై శాపంగా మారిన ఎయిడెడ్ విద్యాసంస్థల నూతన విధానం

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 50ను తక్షణమే రద్దు చేయాలని జనసేనపార్టీ డిమాండ్

అరకులోయ: ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, దశాబ్దాల తరబడి విద్యనందించిన ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మూతపడుతున్నాయని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

విశాఖలోని సిక్రెడ్ హార్ట్ స్కూల్, ప్రకాశం జిల్లాలోని సీఎస్ఆర్ శర్మ కళాశాల.. నెల్లూరుకు తలమానికంగా పేరున్న వీఆర్ హైస్కూల్‌తోపాటు ఎయిడెడ్ విద్యాలయాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలపై అన్యాయంగా పోలీసుల అత్యుత్సాహంతో లాఠీచార్జిలు చేసి మహిళలపై దాడిలు చేయడం దుర్మార్గమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె ఆరోపించారు.!

గతంలో ఫీజురియంబర్స్మెంట్స్ ద్వారా విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లించేదని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసి విద్యాసంస్థలలో సామాన్యులు ఫీజులు చెల్లించలేనివిధంగా ఫీజులు పెంచి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని విద్యకు దూరం చేస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎయిడెడ్ విద్యా సంస్థల నూతన విధానాన్ని జీవో నెంబర్ 50ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.