ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు

కరోనాకు ఆయుర్వేద మందును పంపిణీ చేసే ఆనందయ్యను పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను ఎక్కడికి తరలించారన్న విషయం తెలియకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఆనందయ్య కరోనా మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కృష్ణపట్నం వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. కాగా, ఆనందయ్య ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయనను రహస్య ప్రాంతంలోనే ఉంచుతారని సమాచారం. మరోవైపు, కృష్ణపట్నంలో విధించిన 144 సెక్షన్ కొనసాగుతోంది.