మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బుధవారం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏరకంగా విమర్శించారో ఆ విమర్శని జనసేన తెలంగాణ తరుపున ఖండిస్తున్నాం అని తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ ఎన్. శంకర్ గౌడ్ పేర్కొన్నారు. మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ఎవడి జాగీర్ కాదు.. రాజకీయాలలో ప్రజాసేవ చెయ్యటానికి కష్టపడి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఎం.ఎల్.ఏ అయ్యారు. మీ లాగా మీ తండ్రి రాజకీయ వారసత్వం తీసుకొని ఎం.ఎల్.ఏ కాలేదని గుర్తు పెట్టు కోవాలి జగన్ మోహన్ రెడ్డి గారు. మీరు ఏదైతే విమర్శించారో కార్పొరేటర్ కి ఎక్కువ ఎం.ఎల్.ఏ కి తక్కువ అని.. నేను మీకు చెపుతున్నా మీరు చంచలగూడ జైల్లో ఉన్న పదహరునెలలు మీ పరిస్థితి ఎందో గుర్తుతెచ్చుకోండి, అదేవిధంగా రాజకీయాలు అంటే డబ్బు సంపాదించటం కాదు, మాలాంటి వ్యక్తులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈస్థాయికి తీసుకొచ్చిన జనసేన అధినేత వెంట కోట్లాది జనాలు ఉన్నారు. నీవెంట ఉన్నవాళ్ళు అంతా డబ్బు సంపాదించి వ్యవస్థని చిన్నా భిన్నం చేసే వ్యక్తులు. ఈరోజు జనసేనాని వెంట లక్షల జనం వస్తున్నారంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని గుర్తించి ఈస్థాయికి తీసుకు వచ్చారు. ఎస్ సి. ఎస్.టి, బి.సి, మైనారిటీలను ఆదరించి జనసేన పార్టీ అడుగు జాడల్లో నడవటానికి కంకణం కట్టుకుని ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో జెండా ఎగరవెయ్యటం జరిగింది. అది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో.. డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్ననిన్ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తరిమి తరిమి కొట్టడం జరిగింది. అయినా నీకు బుద్ధి రాలేదు. ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏరకంగా అయితే మాట్లాడావో అభాషని ఇమీడియట్ గా విరమించు కోవాలి. ఎందుకంటే నువ్వు అతి త్వరలో చెంచల గూడ జైల్ నుంచి తీహార్ జైల్ కి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి. ఎందుకంటే కేవలం పదకొండు సీట్లు వచ్చినా గానీ నీ అహం, అహంకారం తగ్గలేదంటే, ప్రజల సొమ్ముని దోచుకున్నావు కాబట్టి, ఆయొక్క అహంకారంతో మాట్లాడుతున్నావ్. రాజకీయాలు మిజాగిరి కాదు. వ్యవస్థలో ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చు, ఎం.ఎల్.ఏ, ఎంపిలు కావచ్చు. కానీ మీ కుటుంబాలకి మాత్రమే రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం ఉన్నట్టు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈవిధంగా విమర్శించి మామనోభావాలను దెబ్బతియ్యొద్దని జగన్ మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన వ్యక్తివి. నువ్వు గతంలో ఏదైతే భాష నువ్వు మాట్లాడి నందుకే నీకు ఈగతి పట్టింది. ఇలాగే మాట్లాడుతూ పోతే రాబోయే రోజుల్లో నీన్ను ఒక్కసిటుకి కూడా పరిమితం కానివ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఎందుకంటే నువ్వు పెట్టుకున్నది ప్రజా బలమున్న, గళమున్న వ్యక్తితో అని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా.. రాజకీయాలకు డబ్బు పనిచెయ్యదు. నువ్వు అడ్డంగా సంపాదించిన డబ్బుని అడ్డం పెట్టుకొని అహంకారంతో తప్పుడు రాజకీయాలు చెయ్యకు. రాజకీయాల్లోకి మరి ఏ వ్యక్తులు కూడా రాకూడదనే ఆలోచనలో ఉన్నావ్. కానీ రోజులు మారాయి తరాలు మారాయి, ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి యువరక్తం తోడైంది. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలని, మరొక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నానని శంకర్ గౌడ్ తెలిపారు.
Share this content:
Post Comment