హింసా రాజకీయాలే వైసీపీకి ముఖచిత్రం

*ఉరవకొండలో జనసేన గళం

ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తలు “నరికేస్తాం” వంటి హింసాత్మక పోస్టర్లు ప్రదర్శించినా, జగన్ ఆ వ్యాఖ్యల్ని సమర్థించడం ఆ పార్టీ అసలు చరిత్రను నెరేపుతోందన్నారు. తన పర్యటనలో కార్యకర్త సింగయ్య కాన్వాయ్ కారు కింద పడి చనిపోయిన ఘటనపై జగన్‌ కనీస మానవత్వం లేకుండా స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయమే ముఖ్యమా? అని ప్రశ్నించారు. ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ అడ్డుకుంటోందన్నారు. గతంలో మహిళలపై దాడులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విషప్రచారాలు జరిగిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఇక అలాంటి దౌర్జన్యాలను సహించదన్నారు. విడపనకల్ మండల కన్వీనర్ గోపాల్ మాట్లాడుతూ, జగన్ తన సొంత కార్యకర్త చనిపోయినా పరామర్శించలేదని, కానీ బెట్టింగ్ బృందాలకు పరామర్శలు చేస్తూ తిరుగుతున్నారని తీవ్రంగా తప్పుబట్టారు.వజ్రకరూరు మండల కన్వీనర్ అచ్చనాల కేశవ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నదని, రాబోయే 20 సంవత్సరాలు ఇదే పాలన కొనసాగాలనే ప్రజాభీష్టం ఉందని అన్నారు. ఈ సమావేశంలో గౌతమ్ కుమార్, చంద్రశేఖర్, గోపాల్, కేశవ్‌లతో పాటు పార్టీ నాయకులు బోయ దేవేంద్ర, మణికుమార్, ధనుంజయ్, అనిల్, వంశీ, రఘు, అభి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment