రాజకీయాలు విలువలతో చేయాలి కానీ దౌర్జన్యంగా కాదు

గురజాల: పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగాజిల్లా కార్యదర్శి కటికం అంకారావు మాట్లాడుతూ.. అభివృద్ధిపై చర్చకి సిద్ధం ఏ పార్టీ ఎవరైనా రావచ్చు అంటారు. వస్తే మీ స్థాయి కాదంటారు. స్మశాన వాటికలు కళ్యాణ మండపాలు కట్టిస్తామని హామీలు ఇస్తారు అడిగితే, వ్యక్తిగత ఆరోపణ చేస్తారు. రాజకీయాలు విలువలతో చేయాలి కానీ, దౌర్జన్యంగా కాదని ఆయన అన్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి సంబంధించి ఎనిమిది కోట్లకి తాకట్టు పెట్టాం తప్పేంటి అని చెప్పిన మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందని ఆయనతో ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు సంపదలు సృష్టించాలే గాని ప్రభుత్వ ఆస్తులు అమ్మే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా మాట్లాడుతూ.. పిడుగురాళ్ల బైపాస్ కి గతంలో మేము వచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సెప్టెంబర్ నాటికి బైపాస్ పూర్తి చేస్తామని చెప్పిన మీరు అక్టోబర్ నెల పూర్తయినా గాని ఎందుకు పూర్తి చేయలేకపోయారని అని ప్రశ్నించారు. మరో 48 గంటల్లో బైపాస్ పై సరైన వైఖరి తెలియజేయకపోతే తొమ్మిదో తారీఖు తుమ్మలచెరువు టోల్ ప్లాజా దగ్గర, పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని ఆయన తెలియజేశారు. జానపాడు గ్రామ ప్రెసిడెంట్ పసుపులేటి నరసింహారావు మాట్లాడుతూ జానపాడు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆ రోడ్డుని వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం, పిడుగురాళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, మండల కార్యదర్శి కొండేపూడి వంశీ, కంభం పాటి ముక్కంటి, డి కొండ కిరణ్, రామాయణం రామయ్య, మాటూరు లింగయ్య, పరమేష్, తోట రామదాసు, సింగంశెట్టి వెంకటరమణ, సతీష్, నాగిని నాయుడు, షేక్ బుడే, తాడువాయి రామకృష్ణ, ఆకుల సుబ్బారావు అభిరామ్, బంక సందీప్ తదితరులు పాల్గొన్నారు.