పంచాయితీరాజ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన పొన్నలూరు జనసేన పార్టీ నాయకులు

కొండేపి: పొన్నలూరు నుండి విప్పగుంట పెదవెంకన్నపాలెం రహదారి మరమ్మత్తులు అధికారులు ప్రారంభించారు. రహదారికి రెండు వైపులా చెట్లను తొలగించారు. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పొన్నలూరు నుండి ఇప్పగుంట, పెద్ద వెంకన్నపాలెం రహదారిని మరమ్మత్తులు చేయమని పంచాయితీరాజ్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను ప్రస్తుతం తొలగించడం జరుగుతుంది. ప్రజలు ప్రాణానికి హాని కలిగించే ఈ ప్రధాన రహదారిని మరమ్మత్తులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీ నుండి అదేవిధంగా పెదవెంకన్నపాలెం మరియు ఇప్పగుంట ప్రజలందరి తరఫునుండి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అతి తొందరలో వేగవంతంగా ఈ రహదారి మధ్యలో ఉన్న గుంతలను కూడా పూడ్చి మరమ్మత్తులు చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాము.