పొన్నలూరు ఎంపీడీవోని సస్పెండ్ చేయాలి: హుస్సేన్, కనపర్తి మనోజ్ కుమార్

  • కలెక్టర్ ని కలవబోతున్న హుస్సేన్, కనపర్తి మనోజ్ కుమార్
  • పొన్నలూరు మండల కేంద్రం సర్వే నెంబర్ 265, 266, జడ్పీ స్థలాలు కాపాడవలసిన బాధ్యత మండల పరిషత్ అధికారులకు ఉంటుంది
  • అక్రమ కేసులకు మేము భయపడం, న్యాయమైన మా పోరాటం ఆగదు

కొండేపి, గత 20 రోజుల నుండి పొన్నలూరు మండల కేంద్రంలో జడ్పీ స్థలాలు కాపాడాలని సామాజికవేత్త షేక్ హుస్సేన్ మరియు జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే బృందం జడ్పీ స్థలాలను సర్వే చేసి తహశీల్దార్ ఆధ్వర్యంలో ఫైనల్ రిపోర్టు ఎంపీడీవోకు అందజేయడం జరిగినది. తహసిల్దార్ సర్వే రిపోర్ట్ అందజేసి 20 రోజులు పైబడుతున్నప్పటికీ అక్రమ కట్టడాన్ని ఎంపీడీవో ఎందుకు తొలగించలేదు. ఎంపీడీవో కచ్చితంగా సమాధానం చెప్పాలి. మరొకపక్క ప్రభుత్వ స్థలం ఆక్రమించి అక్రమ కట్టడాలు జరుపుతుండటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం జరుగుతూ ఉంటే ఎంపీడీవో చూస్తూ ఉండటం, ఎటువంటి చర్యలు వారి మీద తీసుకోకుండా ఉండటం అవినీతి వాటాలో ఎంపీడీవోకు పాత్ర ఉందని మాకు సందేహం కలుగుతుంది. పదేపదే మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గానీ పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన విషయంలో పొన్నలూరు మండలంలో వైసీపీ నాయకులు మరియు ఎంపీడీవో గారి పాత్ర ఉంది అని మాకు అనుమానాలు వస్తున్నాయి, ఇప్పటివరకు అక్రమ కట్టడాలను ఎంపీడీవో ఎందుకు నిలిపివేయలేదు? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీవో ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అతి తొందరలో కలెక్టర్ ని కలిసి పూర్తి వివరాలను వివరించడం జరుగుతుంది. ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పైఅధికారులు దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించుకుంటున్నాము. అక్రమ కట్టడాలు జరుపుతున్న చోట కాకుండా మరొక చోట సర్వే చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ విషయాన్ని అతి తొందర్లో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అమ్మిన వారిపై చర్యలు తీసుకుని, అక్రమ కట్టడం నిర్మిస్తున్న వారికి సహకరిస్తున్న పొన్నలూరు ఎంపీడీవో పి రత్నజ్యోతి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఇండ్ల హరినారాయణను సస్పెండ్ చేయాలని షేక్ హుస్సేన్ మరియు కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు.