ఎమ్మిగనూరులో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

ఎమ్మిగనూరు: మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక నీలకంటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ.. తాము ఎంతగానో అభిమానించే అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయువు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన చేపట్టబోయే ప్రతి సేవా కార్యక్రమాలు గానీ సినిమాలు గానీ విజయవంతం కావాలని పరమేశ్వరుని కోరుకునట్లు తెలిపారు. ఆయన కోసం సేవా స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.