పోసాని చేసింది తప్పే.. తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్

ఇటీవల పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోని సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. కొంతమంది నేతలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అలజడి మొదలయ్యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమా ప్రముఖులు కూడా ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. అయితే వైసీపీ నాయకుడిగా మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలపై కూడా బూతులతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై సీనియర్ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ చేసిన పోసాని చేసిన వ్యాఖ్యలు ఖండింస్తు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

తమ్మారెడ్డి భరద్వాజ పోసాని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. మనం ఎప్పుడూ కూడా నోరు జారి మాట్లాడకూడదు. ఒక్కసారి నోరుజారి మాట్లాడితే ఆ మాట మనం ఏమాత్రం వెనక్కి తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడడం అనవసరమైన విషయం. ఆయన మాట్లాడిన విధానం పై ఏదైనా తప్పు ఉంటే ఆ మార్గంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ అనవసరంగా పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలపై కుటుంబసభ్యులపై తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు.. అని అన్నారు.

ఆ తరహాలో మాట్లాడినప్పుడు అభిమానుల నుంచి ఉండే ఆందోళనలు ట్రోల్స్ ఉంటాయి:

సమస్య వస్తుందని తెలిశాక అలా అంటే ఇంకా తప్పు ఇక పర్సనల్ విషయాలపై ఆ తరహాలో మాట్లాడినప్పుడు ఎప్పటిలానే అభిమానుల నుంచి ఉండే ఆందోళనలు ట్రోల్స్ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక మాట మాట్లాడేటప్పుడు ట్రబుల్ వస్తుందని తెలిశాక మళ్లీ ఆ ట్రబుల్ వచ్చినప్పుడు ఇది చాలా తప్పు అని చెప్పడం కూడా చాలా తప్పు. నేను చెప్పేది ఏమిటంటే ఎవరిని కూడా పర్సనల్ గా అటాక్ చేయాల్సిన అవసరం లేదు. పొలిటికల్ గా ఎటాక్ చేయాలి అంటే చేయండి. పార్టీ పనితీరుపై అలాగే తన విధానాలపై ఏదైనా ప్రశ్నిస్తే బాగుంటుంది కానీ వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.

మీరు కూడా అలానే తిట్టండి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో టికెట్ల రేట్లు విషయంపై అధికార రాజకీయ నేతలను ప్రశ్నించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో సమస్యలపై కూడా ఆయన తనదైన శైలిలో ప్రశ్నించడం జరిగింది. కొంత తీవ్ర స్థాయిలో కూడా అడిగారు. కొంచెం సీరియస్ గా కూడా తిట్టి ఉండవచ్చు. అయితే అదే తరహాలో మీరు కూడా తిట్టి అడిగితే తప్పు లేదు. కానీ పర్సనల్ విషయాలు పై కామెంట్ చేయడం అనేది చాలా తప్పు.

గతంలో కత్తి మహేష్ కూడా ఇదే తరహాలో :

గతంలో కత్తి మహేష్ కూడా.. అయితే పోసాని అభిమానులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని బూతులు తిడుతున్నారు అని, నేను కూడా వెళ్లి చిరంజీవి ఇంటి ముందు కూర్చుని వారి కుటుంబ సభ్యులను కూడా అదే తరహాలో తిడతానని పోసాని చెప్పిన మాటలపై కూడా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. గతంలో కత్తి మహేష్ కూడా ఇదే తరహాలో పర్సనల్ మేటర్ పై కామెంట్ చేశారు. ఒకరికి సంస్కారం లేకపోతే మరొకరికి అయినా సరే సంస్కారం ఉండాలి. ఒకరు అన్నారని మనం కూడా ఇతరుల పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్.. కాదని అన్నారు.

వారంతా పవన్ కళ్యాణ్ చెబితేనే తిట్టారా?

సెలబ్రిటీలు అయిన తర్వాత ఎవరు ఎప్పుడూ ఏదో అంటూనే ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. ట్రోల్ చేసే వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ చెబితేనే ఆయన అనుమతి తీసుకొని చేస్తున్నారా? అనేది కూడా ఆలోచించాలి. గతంలో పవన్ కూడా అభిమానులకు చాలాసార్లు అలా కామెంట్ చేయొద్దు ట్రోల్ చేయవద్దని కూడా చెప్పాడు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూలలో అలాగే కొన్ని వేదికల్లో కూడా అభిమానులకు గట్టిగానే చెప్పారు.