గుంటూరు పశ్చిమ, స్థానిక గుంటూరు 18వ డివిజన్ జనసేన పార్టీ ఆఫీస్ లో గుంటూరు జనసేన డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం 18వ డివిజన్ అధ్యక్షుడు శానం రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు అందరు పాల్గొన్నారు. ఈ సందర్భముగా మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ చిత్రాడ సభ సన్నాహక ఏర్పాట్ల కార్యాచరణ గురించి చర్చించారు. జనసేన పార్టీ ఆవిర్భావము నాటి నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని డివిజన్ అధ్యక్షలు వారి మాటలలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment