అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి పట్టణంలో జనసేన నాయకులు జి.రెడ్డిప్రసాద్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిగా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేసి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్న శుభ తరుణంలో హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు మార్చి14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ ఉత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా విజయవంతం చెయ్యాలని పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మరియు అభిమానులు అందరూ హాజరై కలిసికట్టుగా పండగ జరుపుకుందాంమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయచోటి జనసేన నాయకులు ప్రదీప్, రెడ్డిప్రసాద్ నాయుడు, బులెట్ విజయ్, వెంకటేష్, శివారెడ్డి, బాషా తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment