బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో మార్చి 14 తేదిన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్లను బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బొబ్బిలి జనసేన నాయకులు అడబాల నాగు, పొట్నూరు జనార్దన్, పొట్నూరు రామకృష్ణ, గండేటి శ్రీను, పైలా హరి ప్రసాద్, జమ్మూ గణేష్, వీర మహిళలు వరలక్ష్మి, రామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గం జనసైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి తెలియజేయునది ఏమనగా మార్చి 14వ తేదీన పిఠాపురంలో చిత్రాడ గ్రామం వద్ద జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది. కావున ఈ ఆవిర్భావ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసి విజయవంతం చేస్తారని కోరుచున్నామని అన్నారు.
Share this content:
Post Comment